Skip to main content
Close

మీ వ్యాపారం కోసం SMART మార్కెటింగ్ లక్ష్యాలను సృష్టించండి

మీ వ్యాపారం కోసం SMART మార్కెటింగ్ లక్ష్యాలను సృష్టించండి

  • By Meta Blueprint
  • Published: May 10, 2022
  • Duration 5m
  • Difficulty Beginner
  • Rating
    Average rating: 0 No reviews

మీరు SMART మార్కెటింగ్ లక్ష్యాలను సృష్టించడంలో ఈ పాఠం మీకు మద్దతు ఇస్తుంది. SMART మార్కెటింగ్ లక్ష్యాలను ఎలా సృష్టించాలి అనే విషయంతో పాటు మీ SMART లక్ష్యాలకు వ్యతిరేకంగా మీ ప్రోగ్రెస్ కొలవడం ఎలాగో తెలుసుకోండి.

ఈ పాఠం మీకు ఈ క్రింది విషయాలలో శిక్షణ ఇస్తుంది:

  • స్మార్ట్ మార్కెటింగ్ లక్ష్యాలను సృష్టించండి.
  • మీ స్మార్ట్ లక్ష్యాల ప్రకారం మీ ప్రోగ్రెస్‌ని అంచనా వేయండి.

లిటిల్ లెమన్‌‌ని పరిచయం చేస్తున్నాము

లిటిల్ లెమన్ వ్యవస్థాపకులలో ఒకరైన అడ్రియానో, వ్యాపారాన్ని విస్తరింపజేయాలనుకోవడంతో పాటు ఆన్‌లైన్ ఆర్డరింగ్ మరియు స్థానిక డెలివరీని ప్రారంభించబోతున్నారు. ఈ రెండు ఆఫర్‌లను గురించి అవగాహనను పెంచడానికి అడ్రియానోకి స్మార్ట్ లక్ష్యాలు సహాయపడతాయి.*


*నిరాకరణ ప్రకటన: లిటిల్ లెమన్ అనేది Meta క్రియేటివ్ షాప్ ద్వారా రూపొందించబడిన సృజనాత్మక వ్యాపారం. నిజ జీవిత వ్యాపారాల ద్వారా అందించబడిన కంటెంట్‌కు ఉన్న సారూప్యతలు ఏవైనా ఉద్దేశ్యపూర్వకమైనవి కావు.

స్మార్ట్ లక్ష్యం అనేది నిర్దిష్టమైనది, అంచనా వేయగలది, సాధించగలది, సంబంధితమైనది మరియు నిర్ణీత కాలం కలిగినది. జూన్ నెల చివరి నాటికి సగటున రోజుకి 50 ఆన్‌లైన్ ఆర్డర్‌లను పొందాలని అడ్రియానో కోరుకుంటున్నారు.


అతడి లక్ష్యం స్మార్ట్‌గా ఉందా, లేదా అని నిర్ధారించడానికి క్రింది టెంప్లేట్‌ని ఉపయోగించండి.

Mangata & Galloని పరిచయం చేస్తున్నాము

 

Mangata & Gallo అనేది అత్యధిక నాణ్యత కలిగిన ఆభరణాలు మరియు వజ్రాలు పొదిగిన ఎంగేజ్‌మెంట్ ఉంగరాలను విక్రయించే దుకాణం. వీరి విక్రయాల్లో ఎక్కువ భాగం ఆన్‌లైన్‌లో జరుగుతాయి, అయితే దీనికి స్టోర్ లొకేషన్ కూడా ఉంది. ప్రేమికుల రోజు వస్తోంది మరియు సంవత్సరంలోని ఈ సమయంలో Mangata & Gallo మరిన్ని ఎంగేజ్‌మెంట్ ఉంగరాలను విక్రయిస్తుంది.

Mangata & Gallo యొక్క యజమాని అయిన మరియానా, ఇప్పుడు ఎంగేజ్‌మెంట్ ఉంగరాలపై ఫోకస్ చేసే కొత్త వెబ్‌సైట్‌ని ప్రారంభించారు అలాగే తమ ఎంగేజ్‌మెంట్‌లను గురించి ఆలోచించేటప్పుడు వ్యక్తులు ఎవరైనా Mangata & Gallo గురించి ఆలోచించాలని వారు కోరుకుంటున్నారు. Mangata & Gallo ప్రేమికుల రోజు విక్రయానికి ముందుగా, అంటే జనవరి చివరి నాటికి నెలకు వెబ్‌సైట్ సందర్శకుల సంఖ్యను 5,000కు పెంచాలని ఆమె కోరుకుంటున్నారు.*


*నిరాకరణ ప్రకటన: Mangata & Gallo అనేది Meta క్రియేటివ్ షాప్ రూపొందించిన ఒక సృజనాత్మక వ్యాపారం. నిజ జీవిత వ్యాపారాల ద్వారా అందించబడిన కంటెంట్‌కు ఉన్న సారూప్యతలు ఏవైనా ఉద్దేశ్యపూర్వకమైనవి కావు.



మరియానా లక్ష్యం స్మార్ట్‌దా, కాదా అని తెలుసుకోవడానికి దానిని క్షుణ్ణంగా పరిశీలిద్దాం.

మీ వ్యాపారం కోసం స్మార్ట్ లక్ష్యాన్ని సృష్టించండి

మీ స్వంత లక్ష్యాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మీరు అదే టెంప్లేట్‌ని ఉపయోగించవచ్చు.


  • నిర్దిష్టం: ఏమి చేయవలసి ఉంది?


  • అంచనా వేయగలది: దీన్ని అంచనా వేయవచ్చా?


  • సాధించవచ్చు: దీన్ని పూర్తి చేయవచ్చా?


  • సంబంధితం: దీన్ని పూర్తి చేయగలమా?


  • నిర్ణీత కాలం: ఇది ఎప్పుడు పూర్తవుతుంది?

మీ లక్ష్యాల విజయాన్ని అంచనా వేయండి

మీ ప్రోగ్రెస్‌ని ట్రాక్ చేయడానికి ఈ రెండు ప్రశ్నలను ఉపయోగించండి.


  • విజయం ఎలా ఉంటుంది?


  • నేను విజయాన్ని ఎలా అంచనా వేయగలను?

ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు

మీ మైలురాళ్లను క్రమంగా అంచనా వేయండి, తద్వారా మీ ప్రయత్నాలు మిమ్మల్ని మీ స్మార్ట్ లక్ష్యాల వైపు తీసుకుని వెళ్తున్నాయేమో మీరు చూడవచ్చు.




మీ వ్యాపారం కోసం మీ స్వంత స్మార్ట్ మార్కెటింగ్ లక్ష్యాలను సృష్టించడానికి టెంప్లేట్‌ను ఉపయోగించండి.